నగరవాసులను ఆహ్లాదపరిచేందుకు హుస్సేన్‌సాగర్, లుంబినీ పార్క్ సమీపంలో తేలియాడే మ్యూజికల్ ఫౌంటెన్ గురువారం ప్రారంభమైంది. రూ.17.2కోట్ల వ్యయంతో 180మీటర్ల పొడవు, 10మీటర్ల వెడల్పు, 90మీటర్ల ఎత్తుతో హెచ్ఎండీఏ రూపొందించిన ఫ్లోటింగ్ మ్యూజికల్ ఫౌంటెన్‌ను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఎం.శ్రీలతశోభన్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు. వివిధ థీమ్‌లతో పొగమంచు ఫెయిరీ ఫాగ్, క్లౌడ్ ఎఫెక్ట్‌ను సృష్టిస్తూ అద్భుత వాతావరణంలో ఆహ్లాదకరంగా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఫౌంటెన్ షో ప్రతి రోజూ రాత్రి 7 నుంచి రాత్రి 10గంటల వరకు, వారాంతం, సెలవు దినాల్లో 4షోలు ఉండనున్నాయి.