హైదరాబాద్: హైదరాబాద్లోని (Hyderabad) కుషాయిగూడలో దారుణం చోటుచేసుకున్నది. భార్యను నరికిన భర్త పరారయ్యాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు సమీపంలోని అడ్డగూడురుకు చెందిన బోడ శంకర్, మంజుల దంపతులు గత కొంతకాలంగా కూషాయిగూడలో ఉంటున్నారు. వారికి కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా, నాలుగు రోజుల క్రితం కుటుంబంతో కలిసి మహేశ్ నగర్ కాలనీలో ఉంటున్న సోదరి ఇంటికి శంకర్ వచ్చాడు.
ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి తర్వాత అంతా నిద్రలో ఉండగా భార్యను కత్తితో నరికాడు. ఆమె కేకలు వేడంతో అంతా నిద్ర లేచారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని దవాఖానకు తరలింగా ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.