హైదరాబాద్: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ శివార్లలోని లక్ష్మారెడ్డి పాలెం సమీపంలో ఓ ట్రక్కు బోల్తాపడింది. దీంతో హయత్‌నగర్ నుంచి లక్ష్మారెడ్డి పాలెం వరకు పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లన్నీ కిక్కిరిసిపోవడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రక్కును తొలగించిన పోలీసులు.. ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
Hyt 1