మేడ్చల్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ) ;మల్కాజిగిరి గులాబీమయమైంది. బుధవారం ఆనంద్‌బాగ్ నుంచి మల్కాజిగిరి సర్కిల్ వరకు మంత్రి మల్లారెడ్డి నిర్వహించిన భారీ ర్యాలీ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్చార్జి మర్రి రాజశేఖరెడ్డి పాల్గొన్న ఈ ర్యాలీని చూసి మంత్రి మల్లారెడ్డి లక్ష మెజార్టీతో గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.