ఆటోలకు ఇంధన కష్టాలు
ఆటో డ్రైవర్లకు ఇంధన కష్టాలు తప్పడం లేదు. రెండు వారాలుగా ఆటో గ్యాస్ సరిపడా లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. ఆటో నడిపితే గానీ కుటుంబం గడవని పరిస్థితుల్లో గ్యాస్ సరఫరా లేక బంక్‌లు మూతపడ్డాయి. అక్కడక్కడ తెరిచిన బంక్‌ల ముందర కిలో మీటర్ల మేర ఆటోలు క్యూలైన్ ఉంది. శుక్రవారం ఎర్రమంజిల్ ఆటో గ్యాస్ సెంటర్ నుంచి పంజాగుట్ట సర్కిల్ వరకు ఆటోలు గ్యాస్ కోసం క్యూ కట్టాయి. వంద ఆటోలకు ఇంధనం సరపరా చేసి గ్యాస్ లేదని బంక్‌లు చేతులెత్తేస్తున్నాయి.
- గ్యాస్ కోసం ఆటోల భారీ క్యూ
- ఇంధనం లేక బంక్‌లు మూసివేత
సిటీబ్యూరో, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ) : ఆటో డ్రైవర్లకు ఇంధన కష్టాలు తప్పడం లేదు. రెండు వారాలుగా ఆటో గ్యాస్ సరిపడా లేకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. ఆటో నడిపితే గానీ కుటుంబం గడవని పరిస్థితుల్లో గ్యాస్ సరఫరా లేక బంక్‌లు మూతపడ్డాయి. అక్కడక్కడ తెరిచిన బంక్‌ల ముందర కిలో మీటర్ల మేర ఆటోలు క్యూలైన్ ఉంది. శుక్రవారం ఎర్రమంజిల్ ఆటో గ్యాస్ సెంటర్ నుంచి పంజాగుట్ట సర్కిల్ వరకు ఆటోలు గ్యాస్ కోసం క్యూ కట్టాయి. వంద ఆటోలకు ఇంధనం సరపరా చేసి గ్యాస్ లేదని బంక్‌లు చేతులెత్తేస్తున్నాయి.
ప్రభుత్వం ఇంధన వినియోగంపై సరైన చర్యలు తీసుకోకపోవడంతో బంక్ నిర్వాహకులు ఇష్టానుసారంగా ఇంధన వ్యాపారం చేస్తున్నారు. అక్కడక్కడ రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నారని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎల్పీజీ ధర రూ.63 ఉండగా ఇప్పుడు 90 దాటిందని తెలిపారు. బంక్ నిర్వాహకులు కృత్రిమ ఇంధన కొరత సృష్టించడంలో భాగంగానే చాలా ఎల్పీజీ, సీఎన్జీ బంక్‌ల వద్ద నో స్టాక్ బోర్డు పెట్టారని ఆటో డ్రైవర్లు వాపోయారు. నో స్టాక్ బోర్డులను చూసిన వాహనదారులు వాళ్లడిగినంత ధర చెల్లిస్తారని బ్లాక్ మార్కెట్‌కు తెరలేపారు. బంక్ మోసాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఉచిత ప్రయాణంతో తగ్గిన గిరాకీ!
ఉచిత బస్సుతో గిరాకీ లేక ఇప్పటికే ఆటో వాలాలు దిక్కుతోచని స్థితిలో కొ ట్టుమిట్టాడుతున్నారు. రేవంత్ సర్కార్ ఆటోవాలాలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తానన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు. దీంతో ఆటో డ్రైవర్లు మానసికంగా కుంగిపోతున్నారు. 200 మంందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. తమ సంక్షేమం కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ వారు కోలుకోలేని విధంగా ఇంధన కొరత ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భరించలేమని చాలా మంది గ్యాస్ బండ్లు నడుపుకుంటున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- Autos Huge queue
- gas
- Gas Autos
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

