హిదీపట్నం: మెహదీపట్నం (Mehdipatnam) ఆర్టీసీ డిపో ముందు ఉన్న ఓ ఫంక్షన్ హాల్ యాజమాన్యంతో జరిగిన తోపులాటలో తెలంగాణ హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఉద్యోగి మృతిచెందారు. గత ఎనిమిదేండ్లుగా ఫంక్షన్‌హాల్ యాజమాన్యం హౌసింగ్ బోర్డుకు లీజు డబ్బులు చెల్లించడం లేదు. దీంతో దాదాపు రూ.1.50 కోట్ల బకాయి ఉండటంతో కోర్టు ఆదేశాలతో ఫంక్షన్ హాల్‌ను సీజ్ చేసేందుకు సిబ్బందితో కలిసి అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో యాజమాన్యం, కార్పొరేషన్ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
అది తోపులాటకు దారితీయడంతో అసిస్టెంట్ ఎస్టేట్ ఆఫీసర్ ఆ జగదీశ్వర్ రావు స్పృహ తప్పి పడిపోయారు. దీంతో తోటి ఉద్యోగులు ఆయనను సమీపంలోని దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు సరైన బందోబస్తు కల్పించకపోవడంతోనే తమ ఉద్యోగి చనిపోయారని హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.