బాలానగర్, జనవరి 15 : కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అక్రమ అరెస్టులు చేస్తూ శాడిస్ట్ పరిపాలన సాగిస్తుందని కేపీహెచ్‌బీకాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, నియోజకవర్గం బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ సతీశ్ అరోరా, మరో నేత ప్రభాకర్‌గౌడ్‌లు అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ నిరసన కార్యక్రమాలు చేపుడుతారేమోనని భయంతో పోలీసులు.. కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు, సతీశ్ అరోరా, బాలాజీనగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు ప్రభాకర్‌గౌడ్‌లను ముందస్తు అరెస్ట్ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. పాలనను పక్కన పెట్టి.. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులను అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలపై దృష్టి సా రించి.. అందించాలని, లేని పక్షంలో ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు.