Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో,ఆగస్టు 23(నమస్తే తెలంగాణ) : రాజధానిలో బుధవారం రాత్రి అగంతుకుల కాల్పు ల్లో ఓ హోటల్ మేనేజర్ మృతిచెందాడు. మదీనగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్లో కోల్‌కతాకు చెం దిన దేవేందర్ గాయన్ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దేవేందర్‌పై ఐదురౌండ్లు కాల్పులు జరిపి పరారయ్యారు.
వెంటనే దేవేందర్ దవాఖానకు తరలించగా చికిత్స పొందు తూ మృతిచెందాడు. ఘటనాస్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు, మాదాపూర్ డీసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి ఆరు తూటాలు స్వాధీనం చేసుకొన్నారు. దుండగుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.