సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): ఆర్థరైటిస్‌పై అవగాహన కలిగి ఉంటే ప్రారంభ దశలోనే గుర్తించి నివారణ చర్యలు చేపట్టడం సాధ్యమే అని మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ రుమటాలజిస్ట్ డా.సౌమ్య అన్నారు. ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రోగులకు ప్రత్యేక అవగాహన, ప్రేరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
రుమాటిక్, మస్కులోస్కెలటల్ వ్యాధులతో బాధపడుతున్న వారికి మనోధైర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లుగా తెలిపారు. పోషకాహారం, సులభతరమైన, క్రమం తప్పని వ్యాయామం, వ్యాధిపై సమగ్ర అవగాహన కలిగి ఉంటే సమర్థవంతంగా ఆర్థరైటిస్‌ను ఎదుర్కోవచ్చన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.