సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): అచార్యకులం విద్యార్థులు తమ దివ్య మేధస్సుతో భవిష్యత్‌లో పాఠశాల సగటు 100 శాతానికి తీసుకెళ్లానని స్వామి జి మహరాజ్ కోరారు. ఈ ఏడాది ఆచార్యకులంలో చదువుతున్న అథర్వ, దృవ, సాన్య సెజల్ హైస్కూల్ విద్యార్థులతో పాటు సిద్దేశ్, ఆర్యమాన్, రిద్దిమా.. ఇంటర్లో వివిధ సబ్జెక్టులలో 100కు 100 మార్కులు సాధించగా.. వారిని ఆచార్య శ్రీ అభినందించారు.
సంతోషమైన వాతావారణంలో అచార్యకులం రెసిడెన్షియల్ స్కూల్‌ను పరమ పూజప్య స్వామిజీ మహరాజ్, పరమ్ శ్రద్దే అచార్యశ్రీ మహరాజ్‌లు స్థాపించిన హైస్కూల్, ఇంటర్ విద్యా సంస్థలో విద్యార్థులు 100 శాతం మార్కులు సాధిస్తున్నారని అన్నారు. ఈ సంవత్సరం అథర్వ 99.40 శాతం మార్కులతో మొదటి స్థానాన్ని, దృవ 98 శాతం మార్కులతో రెండో స్తానం, సాన్య సెజల్ 97.80 శాతం మార్కులతో మూడో స్థానంలో నిలిచారని తెలిపారు.
153 మంది విద్యార్థులు 86.30 సగటున మార్కులు సాధించారని, అందులో 21 మంది అన్ని సబ్జెక్టులలో, 43 మంది వివిధ సబ్జెక్టులలో ఎ-1 గ్రేడ్ సాధించారని, 25 మంది విద్యార్థులు 95 శాతం కంటే ఎక్కువ మార్కులు స్కోర్ సాధించారని తెలిపారు. ఇంటర్లో సైన్స్, హ్యుమానిటీస్, కామర్స్ విభాగాలలో సిద్దేశ్ అత్యధికంగా 99 శాతం, ఆర్యమాన్ 98.6 శాతం, రిద్దిమా 98 శాతం మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచారని, 97 మంది విద్యార్థులు 88.38 శాతం సగటుతో పాసయ్యారని తెలిపారు.
14 మంది విద్యార్థులు అన్ని సబ్జెక్టులలో ఎ-1 గ్రేడ్ సాధించగా మరో 32 మంది వివిధ సబ్జెక్టులలో ఏ గ్రేడ్ సాధించారని వివరించారు. భవిష్యత్‌లో మరింత మెరుగైన పర్సంటేజ్ సాధించి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అచార్యకులం మేనేజ్మెంట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ రితమంబర శాస్త్రీ(బెహన్ జి), ప్రిన్సిపాల్ స్వాతీ మున్షి జీ.. విద్యార్థులు, ఉపాధ్యాయులను అభినందించారు. ఈ సమావేశంలో స్వామి ఆర్జున్ దేవ్ జి, వైస్ ప్రిన్సిపాల్ తపస్ కుమార్ బెర జీ, కోఆర్డినేటర్ దీప జి, చీఫ్ హాస్టల్ సూపరింటెండెంట్ అండ్ స్పోర్స్ డైరెక్టర్ అమిత్ జీ తదితరులు పాల్గొన్నారు.