రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ వాణీదేవి, తదితరులు
బేగంపేట్, సెస్టెంబర్ 17: తెలంగాణ ఉద్యమ పోరాటంలో వీహెచ్ దేశాయ్ చేసిన కృషి గొప్పదని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం బేగంపేట్‌లోని బ్రాహ్మణవాడిలో ఉన్న స్వామి రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో తెలంగాణ సమైక్యతా దినోత్సవం సందర్భంగా వీహెచ్ దేశాయ్ పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ దేశాయ్ జీవిత వృత్తాంతం, తొలి తెలంగాణ పోరాట అంశాలను ఆధారంగా చేసుకొని ఆయన కుమారులు రచించిన ది ఆన్సంగ్ హీరో హైదరాబాద్ ఫ్రీడం స్ట్రగుల్ అనే పుస్తకాన్ని హోంమంత్రి, ఎమ్మెల్సీ ఆవిష్కరించారు.
అనంతరం స్వామి రామానంద తీర్థ సమాధికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…తొలి తెలంగాణ పోరాటంలో నిజాం పాలనకు వ్యతిరేకంగా వారు చేసిన పోరాటాలు మరువలేనివన్నారు. వీహెచ్ దేశాయ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను కదిలించిన గొప్ప జర్నలిస్టుగా చరిత్రలో నిలిచారని తెలిపారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పీవీ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ పీవీ ప్రభాకర్‌రావు, మాజీ ఎంపీ జీ వివేక్ , ప్రగ్యా భారతి చైర్మన్ టీహెచ్ చౌదరి, అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సీతారామారావు, సోలార్ ఎనర్జీ డైరెక్టర్ శేఖర్ మారంరాజు పాల్గొన్నారు.