మురుగు పరిష్కారానికి మూణ్నెళ్లు

- శివారు మున్పిపాలిటీల్లో సీవరేజి సమస్యల పరిష్కారానికి జలమండలి చర్యలు
- 20 రోజుల వ్యవధిలో 6,600 ఫిర్యాదుల స్వీకరణ – 85 శాతానికి పైగా వెంటనే పరిష్కారం
- అదనంగా 91 మంది కార్మికులు, 75 సిల్ట్ గ్రాబింగ్ వాహనాల కేటాయింపు
- హాట్ స్పాట్ల తగ్గింపునకు మూడు నెలల కార్యాచరణ
- సమీక్షలో జల మండలి ఎండీ దానకిశోర్
సిటీబ్యూరో, అక్టోబరు 22 (నమస్తే తెలంగాణ): మహా నగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శివారు మున్సిపాలిటీల్లో సీవరేజి సమస్యల పరిషారానికి రానున్న మూడు నెలల పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు జలమండలి ఎండీ దాన కిశోర్ పేరొన్నారు. శివారు మున్సిపాలిటీల్లో సీవరేజి నిర్వహణ బాధ్యతలు జలమండలి చేపట్టి మూడు వారాలు గడిచిన నేపథ్యంలో ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లతో దాన కిషోర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. శివారు ప్రాంతాల్లో ఇప్పటికే సీవరేజి తరచూ ఓవర్ ఫ్లో అయ్యే 792 హాట్ స్పాట్లను గుర్తించినట్లు ఆయన తెలిపారు.
ఈ హాట్ స్పాట్ల వద్ద మురుగు సమస్యకు శాశ్వత పరిషారం కోసం చేపట్టాల్సిన పనులపై ప్రతి హాట్ స్పాట్‌కు వేర్వేరుగా నివేదికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రానున్న మూడు నెలల్లో వీటిల్లో వీలైనన్ని ఎకువ సమస్యలను పరిషరించడానికి చర్య లు తీసుకుంటామని ఎండీ తెలిపారు. సీవరేజి ఓవర్ ఫ్లోకు కారణమవుతున్న తకువ సైజు సీవరేజి పైపులైన్లను గుర్తించాలని, ఇకడ సరిపడా సైజులో కొత్త పైపులైన్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
95 శాతం ఫిర్యాదులను పరిషరించాలి
ఈ నెల ఒకటో తేదీ నుంచి శివారు మున్సిపాలిటీల సీవరేజి బాధ్యతలను జలమండలి తీసుకుంది. ఇకడ మూడు వారాల్లో జలమండలి కస్టమర్ కేర్, ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు, వాట్సాప్, వివిధ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా సీవరేజి సమస్యలపై 6,684 ఫిర్యాదులు రాగా, దాదాపుగా 85 శాతం ఫిర్యాదులను వెంటనే పరిషరిస్తున్నట్లు ఎండీ దాన కిశోర్ తెలిపారు. వచ్చే నెల రోజుల్లో 95 శాతం ఫిర్యాదులను సత్వరమే పరిషరించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.
త్వరగా సమస్యలు పరిషరించడానికి అదనంగా 91 మంది కార్మికులను, 75 హైడ్రాలిక్ సిల్ట్ గ్రాబర్ వాహనాలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. సీవరేజి సమస్యల సత్వర పరిషారం కోసం సరిపడా నిధులను కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఈ ప్రాంతాల్లోని సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు వారి వారి స్థాయిల్లో ప్రజా ప్రతినిధులు, జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని సమస్యలను పరిషరించడానికి చర్యలు తీసుకోవాలని పేరొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ డైరెక్టర్ వీఎల్ ప్రవీణ్ కుమార్, డైరెక్టర్ (ఆపరేష న్స్-2) స్వామి, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు, మేనేజర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- dana kishore IAS
- HMWSSB
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

