జల వనరుల కలుషితాన్ని ఆపొచ్చు

సిటీబ్యూరో, అక్టోబరు 21(నమస్తే తెలంగాణ): పూర్తి స్థాయిలో సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల ట్రీట్మెంట్ ద్వారానే జల వనరులు కలుషితం కాకుండా కాపాడుకోవచ్చని, ఈ దిశగా జలమండలి పని చేస్తోందని ఎండీ దాన కిశోర్ పేరొన్నారు. జలమండలి ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ ప్రాం తాల్లోని సెప్టిక్ ట్యాంకర్ల వ్యర్థాల నిర్వహణ కోసం రూపొందించిన ఫీకల్ స్లడ్జ్ అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ (ఎఫ్ఎస్ఎస్ఎం)వ్యవస్థను అధ్యయనం చేయడానికి అస్సాం, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన మున్సిపల్ అధికారుల బృందం గురువారం జలమండలిని సందర్శించింది. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఆసి), యూనిసెఫ్ ఆధ్వర్యంలో ఈ బృందం నగరంలో సెప్టిక్ వ్యర్థాల నిర్వహణను పరిశీలించింది. ఉప్పల్‌లోని నల్ల చెరువు ఎఫ్ఎస్టీపీని పరిశీలించి వాటి పనితీరును తెలుసుకున్నారు. బోడుప్పల్లో జియో ట్యాగ్ టెక్నాలజీ ద్వారా నడుస్తున్న ఎఫ్ఎస్టీపీని కూడా పరిశీలించారు.
భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా..
క్షేత్రస్థాయి పర్యటన అనంతరం, ఈ బృందం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయానికి విచ్చేసింది. జల మండలి ఆధ్వర్యంలో నగరంలో సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల నిర్వహణ జరుగుతున్న తీరును ఎండీ దాన కిశోర్ వివరించారు. జల వనరులు కలుషితం కాకుండా, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా ఉం డేందుకు సెప్టిక్ ట్యాంకుల వ్యర్థాల ట్రీట్మెంట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాల్లో దాదాపు 12 లక్షల ఇళ్లు, భవనాల సెప్టిక్ వ్యర్ధాల సేకరణ, శుద్ధీకరణకు జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందన్నారు. అలాగే, ఈ ప్రాంతాల్లోని సెప్టిక్ ట్యాంకర్ల నిర్వాహకులకు విధిగా లైసెన్స్ జలమండలి నుంచి పొందేలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేసిందని వివరించారు.
సేకరించిన సెప్టిక్ ట్యాంక్ వ్యర్ధాలను బహిరంగ ప్రదేశాల్లో, చెరువులు, వాగులు, అటవీ ప్రాంతాల్లో పారబోసి నీటిని, భూమిని కలుషితం చేయకుండా జలమండలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందన్నారు. అంతే కాకుండా, రానున్న 20 ఏళ్ల అవసరాలకు తగ్గట్లుగా కొత్త ఎఫ్ఎస్టీపీల నిర్మాణం జరుపుతున్నామన్నారు. డయల్ – ఏ – సెప్టిక్ ట్యాంక్ క్లీనర్ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కె.తారక రామారావు చేతుల మీదుగా జలమండలి ప్రారంభించిందని, దీని ద్వారా ప్రజలకు, సెప్టెక్ ట్యాంకర్ల వాహన ఓనర్లకు, క్లీనర్లకు మేలు జరుగుతోందన్నారు. కార్యక్రమంలో మధ్య ప్రదేశ్ నుంచి ఐఏఎస్ అధికారులు గౌరవ్ బెనల్, సందీప్‌తో పాటు అస్సాం, ఝార్ఖండ్, చత్తీస్ గఢ్ నుంచి నగర పాలక సంస్థల ఉన్నతాధికారులతో పాటు యూనిసెఫ్ ప్రతినిధులు, జలమండలి ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, సీజీఎం ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- dana kishore IAS
- HMWSSB
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

