సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత హెచ్ఎండీఏలో అధికారుల బదిలీలు, రాజీనామాలు, తొలిగింపు వంటివి జరిగాయి. సంస్థలో జరిగిన మార్పులను హెచ్ఎండీఏ వెబ్సైట్లో మాత్రం అప్డేట్ చేయలేదు.
ఇదే విషయమై ‘హెచ్ఎండీఏ అప్డేట్ కాలే’ శీర్షికన నమస్తే తెలంగాణలో కథనం ప్రచురితమైంది.ఈ కథనానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధికారులు స్పందించారు. హెచ్ఎండీఏ ఐటీ విభాగం అధికారులు ఇటీవల కాలంలో జరిగిన ఉన్నతాధికారుల బదిలీలు, ఇతర సమాచారాన్ని వెబ్సైట్లో అప్డేట్ చేశారు.