సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ లే అవుట్లలో రూ. 1.79 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఈ మేరకు టెండర్లు పిలిచారు. ఇన్ముల్నర్వ, లేమూర్, తుర్కయాంజాల్ లే అవుట్లలో సెంట్రల్ మీడియన్తో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ వంటి పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.