మలారంలో కబ్జాల పర్వం
నగరంలో హెచ్ఎండీఏ భూములకు రక్షణ లేకుండా పోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, అండదండలతో కబ్జాదారుల దురాక్రమణలు తారాస్థాయికి చేరాయి. తాజాగా జవహర్నగర్ పరిధిలోని మలారం ప్రాంతంలో హెచ్ఎండీఏకు చెందిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా.. కన్నెత్తి చూసే అధికారులు కరువయ్యారు. అక్రమారులు ఏకంగా భారీ నిర్మాణాలను కట్టేస్తున్నారు. అయినా సంబంధిత యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది
-
అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
-
అడ్డగోలు ఆక్రమణలు.. కరుగుతున్న ల్యాండ్ బ్యాంక్
-
హెచ్ఎండీఏ స్థలాలకు రక్షణేది?
నగరంలో హెచ్ఎండీఏ భూములకు రక్షణ లేకుండా పోతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం, అండదండలతో కబ్జాదారుల దురాక్రమణలు తారాస్థాయికి చేరాయి. తాజాగా జవహర్నగర్ పరిధిలోని మలారం ప్రాంతంలో హెచ్ఎండీఏకు చెందిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా.. కన్నెత్తి చూసే అధికారులు కరువయ్యారు. అక్రమారులు ఏకంగా భారీ నిర్మాణాలను కట్టేస్తున్నారు. అయినా సంబంధిత యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. మలారం ప్రాంతంలోని సర్వే నంబర్లు 706, 758, 757, 756, 755 పరిధిలో హెచ్ఎండీఏ ఆధీనంలోని విలువైన భూములపై అక్రమారులు కన్నేశారు. రాత్రికి రాత్రే కంచెలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు పూర్తి కావడంతో వాటిని కూల్చేందుకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. మంచుగడ్డలా కరిగిపోతున్న భూములను చూసి స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నట్లు స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ, సంబంధిత క్షేత్రస్థాయి అధికారులు, రెవెన్యూ, హెచ్ఎండీఏ యంత్రాంగం స్పందించకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాధనం, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన అధికారులే కబ్జాదారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమే కబ్జా మాఫియా రెచ్చిపోయి విలువైన భూములను ఆక్రమిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు.

వేల కోట్ల భూములను పరిరక్షించామంటూ గొప్పలు చెప్పుకొనే హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు.. కండ్ల ముందే జరుగుతున్న అక్రమ నిర్మాణాలను చూసి నియంత్రించలేకపోతున్నారు. కానీ కోర్టులు స్పందించి, ఆ భూములు ప్రభుత్వ యంత్రాంగానివేనని తేల్చి చెప్పే వరకు కూడా తమ భూముల పరిరక్షణకు హెచ్ఎండీఏ దృష్టి పెట్టడం లేదు.
ఈ క్రమంలో నగరంలో పలు ప్రాంతాల్లో వందలాది ఎకరాలు అన్యాక్రాంతమైనా.. కేవలం న్యాయపోరాటం పేరిట కాలయాపన చేస్తుందే తప్ప..కబ్జా చేసిన భూములను స్వాధీనం చేసుకోవడంలో హెచ్ఎండీఏ పూర్తిగా విఫలం అవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మలా రం ప్రాంతంలోని సర్వే నంబర్లలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. హద్దులను నిర్ధారించి, అక్రమంగా వెలసిన నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూముల రక్షణలో విఫలమైన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై స్పష్టతనివ్వాలని స్థానికులు కోరుతున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

