e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, August 5, 2021
Home హైదరాబాద్‌ నియోపొలిస్‌ కోసం ఈ-ఫెసిలిటీ

నియోపొలిస్‌ కోసం ఈ-ఫెసిలిటీ

నియోపొలిస్‌ కోసం ఈ-ఫెసిలిటీ
  • లే అవుట్‌లో ప్లాట్లపై సమగ్ర సమాచారం
  • కోకాపేట సెజ్‌లో సెంటర్‌ ఏర్పాటు
  • కేంద్రం వద్ద అందుబాటులో అధికారుల బృందం
  • 15న ఆన్‌లైన్‌ వేలం..

సిటీబ్యూరో, జూన్‌ 23 (నమస్తే తెలంగాణ):కోకాపేటలోని నియోపొలిస్‌ లేఅవుట్‌లో హైదరాబాద్‌ మెట్రో పాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సంస్థ ప్రత్యేకంగా ఈ-ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఆన్‌లైన్‌ వేలంలో విక్రయానికి ఉంచిన ప్లాట్ల సమాచారం తెలియజేసేందుకు రెవెన్యూ, ఇంజినీరింగ్‌, ప్లానింగ్‌ విభాగాలకు చెందిన అధికారుల బృందం ఈ కేంద్రం వద్ద అందుబాటులో ఉంటాయి. ఈనెల 15 నుంచే హెచ్‌ఎండీఏ కోకాపేటలో విక్రయించే భూముల వివరాలతో కూడిన బ్రోచర్‌ను ఆన్‌లైన్‌లో ఉంచింది.

25న ఫ్రీ బిడ్‌ మీటింగ్‌, జూలై 13న రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీగా నిర్ణయించారు. అదేవిధంగా ఈఎండీ చెల్లింపు కోసం జూలై 14వ తేదీని నిర్ణయించి, జూలై 15న ఆన్‌లైన్‌ వేలం (ఈ -ఆక్షన్‌) నిర్వహించనున్నారు. ఒక్కో ప్లాటు సైజు కనిష్ఠంగా ఎకరం ఉండగా, గరిష్ఠంగా 9 ఎకరాల వరకు ఉంది. వేలంలో ఉంచిన ఎకరం భూమి ధర మినిమం ఆఫ్‌సెట్‌ ధర రూ.25 కోట్లుగా నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్‌ సంస్థ ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియను నిర్వహిస్తున్నది. ప్రభుత్వ భూముల అమ్మకాలు ఎంతో పారదర్శకంగా ఉండేందుకు ఆన్‌లైన్‌ విధానాన్ని హెచ్‌ఎండీఏ ఎంచుకున్నది.

అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు

- Advertisement -

కోకాపేటలో అభివృద్ధి చేస్తున్న నియోపొలిస్‌ లేఅవుట్‌ కోసం హెచ్‌ఎండీఏ సుమారు రూ.300 కోట్లను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కల్పిస్తున్నది. సుమారు 530 ఎకరాల్లో చేపడుతున్న ఈ లేఅవుట్‌లో విద్యుత్‌ లైన్లు పూర్తిగా భూగర్భ ంలోనే వేస్తున్నారు. రోడ్లన్నీ కనిష్ఠంగా 120 అడుగులు, గరిష్ఠంగా 150 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేస్తున్నారు. ప్లాట్లను విక్రయించేందుకు మార్కెటింగ్‌ పార్ట్‌నర్‌గా అంతర్జాతీయ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అయిన సీబీఆర్‌ఈను నియమించారు.

కోకాపేట నియోపొలిస్‌ లేఅవుట్‌ ఆన్‌లైన్‌ వేలం షెడ్యూల్డ్‌

  • 25 ఫ్రీ బిడ్‌ మీటింగ్‌
  • జూలై 13న రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీగా నిర్ణయం
  • జూలై 14వ తేదీ వరకు ఈఎండీ చెల్లింపు
  • జూలై 15న ఆన్‌లైన్‌ వేలం (ఈ -ఆక్షన్‌)
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నియోపొలిస్‌ కోసం ఈ-ఫెసిలిటీ
నియోపొలిస్‌ కోసం ఈ-ఫెసిలిటీ
నియోపొలిస్‌ కోసం ఈ-ఫెసిలిటీ

ట్రెండింగ్‌

Advertisement