New Year | కొత్త సంవత్సరం వస్తుందంటేనే వేడుకల్లో మునిగి తేలేందుకు వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటుంటారు. చాలా మంది రకరకాల ఏర్పాట్లు చేసుకుంటారు. అందరి మాదిరిగానే భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగించే వారిలో కూడా కొత్త సంవత్సరం వెలుగు నింపాలనే ఉద్దేశంతో.. ఓ కార్పొరేట్ కంపెనీ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హైర్ ఐటీ, స్టాఫింగ్లీ అనే మల్టీ నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ కార్పోరేట్ రెస్పాన్సిబిలిటీ కింద 500 మంది పేదలకు న్యూఇయర్ గిఫ్ట్లు ఇచ్చింది.
హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ సమీపంలో రాజు (పేరు మార్చాం) భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎవరైనా దయ చూపితేనే ఆకలి తీరుతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా రాజు దగ్గరికి వెళ్లారు హైర్ ఐటీ పీపుల్, స్టాఫింగ్లీ ఉద్యోగులు. అతనికి రుచికరమైన తినుబండారాలను ఇచ్చి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. దీంతో అతను సంతోషం వ్యక్తం చేశాడు.