చర్లపల్లి, డిసెంబర్ 29 : కక్షిదారుల కేసులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ సూచించారు. సోమవారం సాయంత్రం మేడ్చల్, మల్కాజిగిరి కోర్టు ఆవరణలో మూడు ఫ్యామిలీ కోర్టులను కోర్ట్స్ ఆఫ్ ప్రిన్సిపల్ ఫ్యామిలీ జడ్జి, అడిషనల్ ఫ్యామిలీ జడ్జి, అడిషనల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి, జునియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్, మేడ్చల్, మల్కాజిగిరి డిస్ట్రిక్ట్ కోర్టులను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన ్టన్యాయమూర్తి శ్రీదేవి, కలెక్టర్ మనుచౌదరిలతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా న్యాయమూర్తి లక్ష్మణ్ మాట్లాడుతూ మూడు ఫ్యామిలీ కోర్టులు, పోక్సో కోర్టులో నాలుగు వేలకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎన్.శ్రీదేవిని న్యాయవాదులు సన్మానించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు ఆశాలత, బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు అమరేందర్‌రెడ్డి, బాపిరెడ్డి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.