Formula E race : తెలంగాణ గడ్డ మీద మరికొద్ది రోజుల్లో అంతర్జాతీయ ఫార్ములా- ఈ రేస్ జరగనుంది. అది కూడా హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ తీరాన. దాంతో, టాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖుల సుంచి మంత్రి కేటీఆర్, ఎచ్ ఎండీఏకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హీరో నాగార్జున ట్విట్టర్ వేదికగా కేటీఆర్‌కు కంగ్రాట్స్ చెప్పారు. ఫిబ్రవరి 11న ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నందుకు మంత్రి కేటీఆర్‌కు అభినందనలు అని నాగ్ ట్విట్టర్లో వీడియో పెట్టారు. నాగార్జున ట్విట్‌ను కేటీఆర్ రీ-ట్వీట్ చేశారు. ‘నెట్ జీరో స్పోర్ట్ ఫార్ములా ఈను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు కేటీఆర్ గారు, తెలంగాణ సీఎంఓ, హెచ్ఎండీఏ, అనిల్ చలమలశెట్టికి అభినందనలు. హుస్సేన్ సాగర్ తీరంలో ఫిబ్రవరి 11న చరిత్ర సృష్టిద్దాం’ అని నాగార్జున ట్విట్టర్ పోస్ట్‌కు క్యాప్షన్ రాసుకొచ్చారు.
‘అందరికీ నమస్కారం.. ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌ను భారతదేశానికి, ముఖ్యంగా హైదరాబాద్‌కు తీసుకొచ్చినందుకు కేటీఆర్, అనిల్ చలమలశెట్టిలకు అభినందనలు తెలియజేస్తున్నా. ఫిబ్రవరి 11న గ్రీన్కోహైదరాబాద్ఈప్రిక్స్ వద్ద మీ అందరినీ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచుస్తున్నా. లెట్ ది రేస్ ఈస్ బిగిన్’ అని నాగార్జున అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈరేసుకు సంబంధించిన టికెట్లను ఇప్పటికే బుక్‌మైషోలో అమ్మకానికి పెట్టారు.
11 దేశాల నుంచి 22 మంది
ఫిబ్రవరి 11న జరగబోయే ఫార్ములా ఈ రేస్‌కు సన్నద్ధంగా ఫిబ్రవరి 10వ తేదీన ప్రాక్టీస్ రేసింగ్ నిర్వహించనున్నారు. ఈ రేస్‌లో 11 దేశాల నుంచి మొత్తం 22 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు. రేస్ నిర్వహణ కోసం హుస్సేన్ సాగర్ తీరాన 18 మలుపులతో 2.8 కిలోమీటర్ల పొడవైన ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున 2022 నవంబర్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే.
Congrats to @ktrtrs garu, @telanganacmo, @HMDA_Gov & Anil Chalamalasetty for bringing, the first-ever #NetZero sport since inception, #FormulaE to #Hyderabad, #India. Let’s make history near the picturesque Hussain Sagar Lake at #GreenkoHyderabadEPrix on February 11! @acenxtgen pic.twitter.com/J2VjBV8eMl
— Nagarjuna Akkineni (@iamnagarjuna) January 26, 2023