ఒక్క ఫోన్ కొడితే చాలుక్షేమ సమాచారాలు

- కొవిడ్ బాధితులకు పోలీసుల భరోసా..
- ప్రధాన వైద్యశాలల్లో 24/7 సహాయక కేంద్రాలు
- ఆక్సిజన్ వాహనాలకు జీపీఎస్‌తో ట్రాకింగ్
- వాటికి ప్రత్యేకంగా గ్రీన్ చానల్
- నగరంలో ఆక్సిజన్ కొరత లేదు
- నిమ్స్ హెల్ప్‌డెస్క్ ప్రారంభోత్సవంలో సీపీ అంజనీ కుమార్
- రాచకొండ సీపీ కార్యాలయంలోనూ టెలీ కౌన్సెలింగ్ కేంద్రం
మీ కుటుంబ సభ్యులు సర్కారు దవాఖానలో కొవిడ్ చికిత్స పొందుతున్నారా? వారు ఎలా ఉన్నారోనన్న దిగులొద్దు. ఒక్క ఫోన్ కొట్టండి చాలు. మన పోలీసులు వెంటనే క్షేమ సమాచారం అందిస్తున్నారు. కొవిడ్ బాధితుల కుటుంబ సభ్యులకు గుండె ధైర్యమిస్తున్నారు. ఎలాంటి సహాయమైనా చేసేందుకు మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. వైద్యవిభాగంతో సమన్వయం చేసుకుంటూ.. ప్రధాన వైద్యశాలలు, కమిషనర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలూ సేవలందిస్తున్నారు. ఎవరైనా ఈ కేంద్రాల్లో సంప్రదిస్తే చాలు.. అక్కడి సిబ్బంది అవసరమైన సమాచారం ఇస్తున్నారు. రోగుల వివరాలు, పడకల సంఖ్య, ఆక్సిజన్ సౌలభ్యత, వెంటిలేటర్ వసతులు.. ఇలా అన్ని వివరాలు తెలియజేస్తున్నారు. చికిత్స పొందుతున్న తమ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు కుటుంబసభ్యులు ఈ సహాయ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. కాగా, నిమ్స్ దవాఖానలో సోమవారం సీపీ అంజనీకుమార్ హెల్ప్‌డెస్క్‌ను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఆక్సిజన్ వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను వినియోగిస్తున్నామని, త్వరగా గమ్యం చేరేలా గ్రీన్ చానెల్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఓ వైపు కరోనాను కట్టడి చేస్తూ.. మరోవైపు కరోనా బాధితులకు సేవలందించడంలో హైదరాబాద్ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. జీహెచ్ఎంసీ, వైద్యశాఖతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. మరోవైపు గాంధీ, కింగ్‌కోఠి, నిమ్స్‌లో ఆయా వైద్య విభాగాలతో కలిసి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటగా గాంధీలో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ ఆ తర్వాత మిగిలిన అన్ని వైద్యశాలలకు విస్తరించింది. కరోనాతో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వారి బంధువులకు తెలియజేయడంలో ఈ సహాయ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాక ఈ కేంద్రాల ద్వారా ఆయా వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న రోగులు, పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల వివరాలు తెలుసుకోవడం సులభంగా మారింది. నగరవాసులకు కావాల్సిన సహాయం చేయడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సిబ్బందికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.
సమన్వయంతో సేవలు..
ప్రభుత్వ శాఖల సమన్వయంతో సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లు బెడ్ మేనేజ్మెంట్ సిస్టం, జీహెచ్ఎంసీ అంబులెన్స్ బుకింగ్ విధానం, ఆక్సిజన్ సరఫరా వివరాలు, కొవిడ్‌తో మరణించిన వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాయి. అంతేకాక కేవలం ప్రభుత్వ వైద్యశాలల సమాచారమే కాక ఇతర ప్రైవేట్ వైద్యశాలలకు సంబంధించిన వివరాలను ఫోన్ చేసిన వారికి అధికారులు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజలు, వైద్య విభాగానికి వారధిగా..
- ప్రజలు, వైద్య విభాగానికి మధ్య వారధిగా పోలీస్ హెల్ప్ డెస్క్‌లు పని చేస్తున్నాయి.
- అంతేకాక కొవిడ్ రోగులను రక్షిస్తున్న వైద్యులకు ప్రతి విషయంలో పోలీసులు అండగా నిలుస్తున్నారు.
- ప్రతి ప్రభుత్వ వైద్యశాలకు పోలీసు విభాగం నుంచి ఓ నోడల్ అధికారిని నియమించారు.
- ఆయా అధికారులు అక్కడి వైద్యులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు సేవలందించడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
- నాలుగు రోజుల క్రితం గాంధీ దవాఖానలో ప్రారంభమైన హెల్ప్ డెస్క్‌కు ప్రతిరోజు 200కు పైగా కాల్స్ వస్తున్నాయి.
- అక్కడి వైద్యులతో సమన్వయం చేసుకుంటూ మూడు షిఫ్ట్‌ల్లో ఈ డెస్క్‌ను నిర్వహిస్తున్నారు.
- ఈ కేంద్రం నుంచి ఖాళీ అవుతున్న పడకల సమాచారం.. చికిత్స పొందుతున్న రోగుల వివరాలను వారి బంధువులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు.
- ఒకప్పుడు రోగుల సమాచారం తెలుసుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వచ్చేది.
- ఇప్పుడు ఆ బాధ తప్పింది. కింగ్కోఠిలోనూ ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్ అనేక మందికి ఉపయోగపడుతున్నది.
- ఇక నగర పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంకు ప్రతిరోజు సుమారు ౩౦ మంది ఫోన్లు చేస్తున్నారు.
అడిగిన వెంటనే సమాచారం
అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తున్నది. ప్రధాన వైద్యశాలల్లో ఇప్పటికే హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. మరిన్ని దవాఖానాల్లోనూ వీటి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. లైజనింగ్ అధికారుల ద్వారా దవాఖానలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రజలకు తెలియజేస్తున్నాం. వైద్యాధికారులు, జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుంటున్నాం. నగర పోలీసుల తరుపున వైద్యులు, వైద్య బృందానికి వందనం చేస్తున్నా. కొవిడ్‌పై కొందరు పుట్టిస్తున్న పుకార్లను నమ్మవద్దు. ఏ సమాచారం కావాలన్నా హెల్ప్డెస్క్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.
హెల్ప్ డెస్క్‌లతో క్షణాల్లో సమాచారం
- హెల్ప్ డెస్క్‌లతో క్షణాల్లో సమాచారం అందుతున్నదని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు.
- నిమ్స్ దవాఖానలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సోమవారం డైరెక్టర్ డాక్టర్ కె.మనోహర్‌తో కలిసి ప్రారంభించారు.
- అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి నగరానికి సరఫరా అవుతున్న ఆక్సిజన్ సిలిండర్లకు పూర్తి భద్రత కల్పిస్తున్నామన్నారు.
- ఇందుకోసం అత్యాధునిక జీపీఎస్ వ్యవస్థను వినియోగిస్తున్నామని అన్నారు.
- తొలి పాయింట్ నుంచి ఆస్పత్రికి చేరే వరకు వాటిని ట్రాకింగ్ చేస్తున్నామని తెలిపారు.
- ఇందుకోసం ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. నగరంలో ఆక్సిజన్ కొరత లేదని స్పష్టం చేశారు.
- ఢిల్లీ, ముంబయి, కోల్‌కతాతో పోల్చుకుంటే నగరంలో పరిస్థితి అదుపులోనే ఉందని వెల్లడించారు.
- కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు ప్రజలంతా కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
- నిమ్స్‌లో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌కు 6304429331 నంబరు కేటాయించామని.. ఇది 24 గంటలు పని చేస్తుందని తెలిపారు.
- కొవిడ్ రోగులకు కావాల్సిన సమాచారాన్ని క్షణాల్లో అందిస్తామన్నారు. డైరెక్టర్ మనోహర్ మాట్లాడుతూ ప్రస్తుతం నిమ్స్ దవాఖానలో కొవిడ్ రిఫరల్ రోగులను మాత్రమే తీసుకుంటామన్నారు.
- నేరుగా ఆస్పత్రిలో చేర్చుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు.
- కార్యక్రమంలో వెస్ట్ జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, పంజాగుట్ట ఏసీపీ పీవీ గణేశ్, నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నిమ్మ సత్యనారాయణ, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆంధ్రా విద్యుత్ పునరుద్ధణ పనుల్లో మన ఉద్యోగులు
‘పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలి’
పలు కుటుంబాలకు రేగా, దిండిగల పరామర్శ
కుమారుడితో కలిసి 18వ అంతస్తు నుంచి దూకిన మహిళ.. భర్త మళ్లీ పెళ్లి చేసుకోవాలంటూ లేఖ
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం కొత్త ప్రయాణం.. జర్నలిస్టు నిధి రజ్దాన్‌తో వివాహం
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

