హైదరాబాద్: హైదరాబాద్‌లోని మలక్‌పేట రైల్వే బ్రిడ్జ్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. చాదర్‌ఘాట్-మలక్‌పేట మార్గంలోని ఫ్లైఓవర్ వద్ద ఉన్న మ్యాన్‌హోల్ పొంగుతున్నది. నల్లగొండ ఎక్స్ రోడ్డు నుంచి మలక్‌పేట రైల్వే బ్రిడ్జి వరకు వరద నీరు ముంచెత్తింది. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో పెద్ద సంఖ్యలో ట్రాఫిక్ జామ్ అయింది. చాదర్‌ఘాట్-దిల్సుఖ్నగర్ మార్గంలో నల్లగొండ చౌరస్తా వరకు, దిల్సుఖ్నగర్-కోఠి మార్గంలో మలక్‌పేట గంజ్ నుంచి చాదర్‌ఘాట్ సిగ్నల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
శుక్రవారం కూడా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మురుగు నీటితో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం కూడా సమస్య పరిష్కారం కాకపోవడంతో మరోసారి వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు.