Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కొత్త సంవత్సరం ప్రారంభం వేళ పెద్దమ్మ గుడి, టీటీడీ ఆలయం, జగన్నాథ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ ఆలయాల వద్ద కిలోమీటర్‌కు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భక్తులు కూడా బారులు తీరారు. సీఎం వచ్చే మార్గం కావడంతో ట్రాఫిక్ పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులకు వాహనదారులు సహకరించాలని కోరుతున్నారు.