Traffic Jam | హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం నుంచి దాదాపు గంట నుంచి గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా షేక్‌పేటలో 12.4 సెంటీమీటర్ల అతిభారీ వర్షం కురిసింది. గంటపాటు కురిసిన వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు పోటెత్తింది. పలుచోట్ల రోడ్లు నదులను తలపించాయి. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, ఖైరతాబాద్, అమీర్‌పేట్, ఎర్రగడ్డ, మూసాపేట, బోరుబండ, యూసఫ్‌గూడ, సనత్ నగర్, అబిడ్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, నారాయణగూడ, సికింద్రాబాద్, పఠాన్ చెరువు, రహమత్‌నగర్, కూకట్పల్లి, దుర్గం చెరువు, మణికొండ, దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు నగరవ్యాప్తంగా వర్షం కురిసింది. వర్షం మొదలైన కొద్దిసేపటి నుంచి మాదాపూర్, గచ్చిబౌలి, ఐటీ హబ్ శిల్పారామం, అమీర్‌పేట, కూకట్పల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.
ఐకియా సెంటర్, ఏఎంబీ, ఇనార్బిట్ మాల్, కొండాపూర్లోనూ ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు ఏమాత్రం ముందుకు కాదలడం లేదు. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వరకు ట్రాఫిక్ స్తంభించింది. కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గ్, హైటెక్ సిటీతో పాటు సెక్రటేరియట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. అవుటర్‌రింగ్ రోరడ్ నుంచి శిల్పా లేఅవుట్, కొండాపూర్ కొత్త బ్రిడ్జి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అమీర్‌పేట, మైత్రివనం, పంజాగుట్ట, గ్రీన్‌పార్క్, బేగంపేట, బంజారాహిల్స్-12, మాసబ్ ట్యాంక్, మెహిదీపట్నం, నానల్, లక్డీకపూల్, సచివాలయం, దాదాపు రెండు గంటలకుపైగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాల్లోతు వరకు వరద నీరు నిలిచింది. వరద నీటిని పోలీసులు, హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు. భారీగా ట్రాఫిక్ కావడంతో కంట్రోల్ చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది.