సిటీబ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రెండ్రోజులుగా గ్రేటర్లో వాన దంచికొడుతున్నది. ఈ క్రమంలో శనివారం రాత్రి గంటన్నరపాటు ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షానికి మహానగరం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్లోతు వాననీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, మలక్‌పేట, ఎల్బీనగర్, మెహిదీపట్నం, రేతిబౌలి, అత్తాపూర్, ఉప్పర్‌పల్లి తదితర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలను క్రమబద్ధీకరించడంలో ట్రాఫిక్ పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు.
దీంతో వాహనదారులు మరింత ఇబ్బందులుపడ్డారు. కాగా, శనివారం రాత్రి 9 గంటల వరకు లంగర్‌హౌస్‌లో అత్యధికంగా 9.10 సెం.మీల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశమున్నదని, దీని ప్రభావంతో రాగల మూడు రోజులు మోస్తరు నుంచి భారీ, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపింది. గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.
నగరంలో వర్షపాతం నమోదు ఇలా..