Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో గత రెండు రోజుల నుంచి ప్రతి సాయంత్రం భారీ వర్షం కురుస్తోన్న సంగతి తెలిసిందే. శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ నగరమంతా మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. పలు చోట్ల వాన మొదలైంది. ఇప్పటికే రంగారెడ్డి, వికారాబాద్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. ఒకట్రెండు గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. దీంతో నగర ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఆఫీసుల నుంచి నివాసాలకు వెళ్లే వాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Action begins in Hyderabad with scattered storms forming at Nizampet, Miyapur side. More storms to form across Hyderabad next 1-2hrs. Some will be heavy ⚠️🌧️
Already Rangareddy, Vikarabad getting good intense rains, will continue in coming hours too 🌧️
— Telangana Weatherman (@balaji25_t) June 7, 2024