వేపచెట్ల వ్యాధిని నిర్మూలిస్తాం : ఎఫ్సీఆర్ఐ
రాష్ట్రంలో వేపచెట్లు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం వంటి కారణాలపై ములుగులోని ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సమగ్ర శాస్త్రీయ అధ్యయనం మొదలు పెట్టామని ఆ కాలేజీ డీన్ వీ కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వేపచెట్లు ఎండిపోవడం, ఆకులు రాలిపోవడం వంటి కారణాలపై ములుగులోని ఫారెస్ట్ కాలేజీ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సమగ్ర శాస్త్రీయ అధ్యయనం మొదలు పెట్టామని ఆ కాలేజీ డీన్ వీ కృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2021లో ఎఫ్సీఆర్ఐ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ఈ లక్షణాలు గమనించడంతో ఈ సమస్యపైన కాలేజీ ఆధ్వర్యంలో పరిశోధన ప్రారంభించినట్టు తెలిపారు.
వేపచెట్లకు వచ్చే డైబ్యాక్ వాధికి గల కారణంపై ప్రాథమికంగా చేసిన పరిశీలనలో ‘ఫోమాస్పిస్ అజాదిరాక్టీ’ అనే శీలింద్రం (ఫంగస్)పై లోతైన అధ్యయాన్ని ప్రారంభించామని వెల్లడించారు. వేపచెట్టు పర్యావరణకు మూలస్తంభం మాత్రమే కాదని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. దీనిని రక్షించడం శాస్త్రీయమైన బాధ్యతతోపాటు సాంస్కృతిక కర్తవ్యమని వెల్లడించారు. అందువల్ల ఈ వ్యాధిపై లోతుగా అధ్యయనం చేసి, శాశ్వతంగా నిర్మూలిస్తామని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

