Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మరోసారి వాన దంచికొట్టనుంది. మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్‌మ్యాన్ టీ బాలాజీ హెచ్చరించారు. బాలాజీ హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉంది.
మధ్యాహ్నం 3 గంటల వరకు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఇక సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బుధవారం తెల్లవారుజామున కూడా వర్షం కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ నగరంతో పాటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని బాలాజీ హెచ్చరించారు. రాత్రంతా కుండపోత వర్షం కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
HEAVY DOWNPOUR WARNING FOR HYDERABAD AND SURROUNDING DISTRICTS TODAY ⚠️
A massive TROUGH LINE is expected to pass through Hyderabad region, therefore Hyderabad and surrounding districts like Medak, Sangareddy, Kamareddy, Siddipet, Rangareddy, Vikarabad, Yadadri – Bhongir,…
— Telangana Weatherman (@balaji25_t) September 16, 2025