Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. ఇవాళ ఉదయం నుంచి పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఇక సాయంత్రానికి నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
ముషీరాబాద్, అశోక్ నగర్, గాంధీ నగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, భోలక్పూర్, కవాడిగూడ, దోమలగూడ, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, హైదర్ నగర్, ఆల్విన్ కాలనీ, ప్రగతి నగర్, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట, సూరారం, కొంపల్లి, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, బాలానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కృష్ణానగర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది.
ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. దీంతో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.