హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరడంతో.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గ్రేటర్ పరిధిలోని శేరిలింగంపల్లిలో అత్యధిక వర్షపాతం నమోదైంది.
శేరిలింగంపల్లి – 9.2 సెం.మీ.
బాలానగర్ – 9.2 సెం.మీ.
గాజులరామారం – 9 సెం.మీ.
జీడిమెట్ల – 8.8 సెం.మీ.
బాలాజీనగర్ – 8.6 సెం.మీ.
రాజేంద్ర నగర్ – 8.5 సెం.మీ.
హైదర్ నగర్ – 8.1 సెం.మీ.
కేపీహెచ్‌బీ కాలనీ – 7.9 సెం.మీ.
మియాపూర్ – 7.2 సెం.మీ.
మాదాపూర్ – 7 సెం.మీ.
మౌలాలి – 6.8 సెం.మీ.
శివరాంపల్లి – 6.7 సెం.మీ.
నేరేడ్మెట్ – 6.7 సెం.మీ.