Hyderabad Rains | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తింది. నగరంలోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం నుంచి నగర వ్యాప్తంగా ఎండ దంచికొట్టిన సంగతి తెలిసిందే. ఉన్నట్టుండి సాయంత్రం 4 గంటల నుంచి ఆకాశం మేఘావృతమైంది. 5 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది.
పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, మెహిదీపట్నం, లక్డీకాపూల్, బేగంపేట్, హుస్సేన్ సాగర్, సికింద్రాబాద్, తార్నాక, ఎల్బీనగర్, హబ్సిగూడతో పాటు పలు ప్రాంతాల్లో వాన దంచికొట్టింది. భారీ వర్షం పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Mahesh Kumar Goud | తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేశ్ కుమార్ గౌడ్
Duleep Trophy | చరిత్ర సృష్టించిన ముషీర్, సైనీ .. దులీప్ ట్రోఫీలో నయా రికార్డు
Ola Auto Driver | ఓలా రైడ్ క్యాన్సల్ చేసినందుకు రెచ్చిపోయిన ఆటోడ్రైవర్.. ఏం చేశాడంటే?