Hyderabad Rains | హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది. కూకట్పల్లి, మూసాపేట, కేపీహెచ్‌బీ, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్, పటాన్చెరు, రామచంద్రాపురం, అమీన్పూర్, ఐడీఏ బొల్లారం, గుమ్మడిదలలో వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా రహదారులన్నీ జలమయమయ్యాయి.
హైదరాబాద్‌తో పాటు మెదక్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం కురుస్తున్నది. భారీ వర్షం కారణంగా మెదక్‌లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రామాయంపేటలోని పలు కాలనీల్లో నీరు నిలిచిపోయింది. కామారెడ్డిలో భారీ వర్షం కారణంగా రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. వరద నీటి కారణంగా 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గంటకు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది.