హైదరాబాద్: అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు. మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. నగరంలో శనివారం ఆయా ప్రాంతాల్లో కురిసిన వర్షపాతం ఈవిధంగా నమోదైంది.
కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్‌లలో 4.1 సెంటీమీటర్లు, కాంచన్‌బాగ్‌లో 4.0, ఉప్పల్ రాజీవ్‌నగర్ కమ్యూనిటీ హాల్ ప్రాంతం, తిరుమలగిరిలో 3.8, మల్కాజిగిరిలో 3.7, చిలకానగర్లో 3.6, కాప్రాలో 3.5, జీడిమెట్లలో 3.4, జహనుమాలో 3.2, వెస్మారెడ్పల్లిలో 3.0, పికెట్‌లో 2.9, నాచారంలో 2.8, ఆనంద్‌బాగ్, బండ్లగూడ ఇందిరానగర్, సఫిల్‌గూడలో 2.7, గాజులరామారంలో 2.6, చందులాల్ బరాదరిలో 2.4, సీతాఫల్మండి, చర్లపల్లిలో 2.3, డాక్టర్ ఏఎస్ రావునగర్ 2.2, మెట్టుగూడ, గన్సీబజార్, 2.1, అల్వాల్ టెలికాంకాలనీ, మచ్చబొల్లారంలో 2.0 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.