సిటీబ్యూరో, జూలై 7 (నమస్తేతెలంగాణ): రుతుపవనాలకుతోడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాగల 3 రోజులు గ్రేటర్‌వ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాలు కురిసే అవకాశముండడంతో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
గురువారం నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. నాంపల్లిలో అత్యధికంగా 2.3 సెం.మీల వర్షపాతం నమోదైంది.