Rain Alert | హైదరాబాద్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడే సూచనలున్నాయని, మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ఇప్పటికే ప్యాట్నీ, తిరుమలగిరి, అల్వాల్, ప్యారడైజ్, బేగంపేట్, బోయినపల్లి, మారేడ్పల్లి, చిలుకలగూడతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.