హైదరాబాద్ : నగరంలో శనివారం సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. గచ్చిబౌలి, సనత్‌నగర్, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, పంజాగుట్ట, మైత్రీవనం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మియాపూర్, శేరిలింగంపల్లి, మాదాపూర్, రాయదుర్గం ప్రాంతాల్లో వర్షం కురిసింది. కూకట్పల్లి, హైదర్‌నగర్, అల్విన్‌కాలనీ, నిజాంపేట, ప్రగతినగర్‌తో పలుచోట్ల వాన కురిసింది. వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది.