Toxic | ‘టాక్సిక్’ వసూళ్లలో భారీ డ్రాప్.. అయినా రూ.310 కోట్ల మార్క్ దాటిన యశ్ మూవీ!
Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యశ్ సరసన కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తార సుతారియా, నయనతార వంటి స్టార్ నటీనటులు నటించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది.
Toxic | కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యశ్ సరసన కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తార సుతారియా, నయనతార వంటి స్టార్ నటీనటులు నటించడంతో ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ హైప్ ఏర్పడింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల్లోనే కాకుండా ట్రేడ్ వర్గాల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే సినిమా విడుదలైన తర్వాత మాత్రం అంచనాలకు తగ్గట్టుగా వసూళ్లలో జోరు కొనసాగలేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’ ఆ తర్వాతి రోజుల్లో కలెక్షన్ల విషయంలో గణనీయంగా తగ్గుముఖం పట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘టాక్సిక్’ ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ నమోదు చేసింది. విడుదలైన మొదటి రోజే రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల లెక్కలు వెల్లడిస్తున్నాయి. యశ్‌కు ఉన్న పాన్ ఇండియా క్రేజ్, సినిమాపై ఉన్న భారీ అంచనాలు ఈ స్థాయి ఓపెనింగ్స్‌కు ప్రధాన కారణంగా నిలిచాయి.అయితే మొదటి రోజు తర్వాత పరిస్థితి మారిపోయినట్లు తెలుస్తోంది. రెండో రోజు నుంచే సినిమా వసూళ్లలో డౌన్‌ట్రెండ్ కనిపించిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. తొలిరోజే రూ.150 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన ‘టాక్సిక్’.. ఆ తర్వాత మరో రూ.150 కోట్ల గ్రాస్ మార్క్‌ను అందుకోవడానికి ఏకంగా ఆరు రోజుల సమయం తీసుకున్నట్లు సమాచారం. అంటే ఓపెనింగ్ డేలో కనిపించిన జోరు తర్వాతి రోజుల్లో కొనసాగలేదని ఈ లెక్కలు సూచిస్తున్నాయి.
భారీ అంచనాలతో వచ్చిన సినిమా కావడంతో ఈ వసూళ్ల ట్రెండ్‌పై ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తొలి రోజు కలెక్షన్లతో పోలిస్తే ఆ తర్వాతి రోజుల్లో వసూళ్లు తగ్గడం సినిమాకు కొంత ప్రతికూల అంశంగా మారినట్లు తెలుస్తోంది. ఇక ‘టాక్సిక్’ మొదటి వారం రన్ పూర్తి చేసుకునే సమయానికి ప్రపంచవ్యాప్తంగా రూ.310 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు కన్నడ సినీ వర్గాల పీఆర్ లెక్కలు చెబుతున్నాయి.అయితే ఈ వసూళ్లలో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. సినిమాకు వచ్చిన మొత్తం గ్రాస్‌లో దాదాపు సగం వరకు హిందీ మార్కెట్ నుంచే వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో యశ్‌కు నార్త్ ఇండియాలో ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘టాక్సిక్’కు మొదటి రోజు వచ్చిన భారీ ఓపెనింగ్స్‌ను చూస్తే సినిమా మరింత భారీ స్థాయికి చేరుతుందని అభిమానులు అంచనా వేశారు. అయితే ఆ తర్వాత కలెక్షన్లు తగ్గడంతో ఇప్పుడు సినిమా ఫుల్ రన్లో ఎక్కడ వరకు వెళ్లగలుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- collections
- geetu mohandas
- kgf
- look
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ కెరీర్లో మరో చారిత్రక మైలురాయి .. ‘జైలర్ 2’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
మార్కెట్లో రూ.9,500.. మిల్లులో రూ.8 వేలే.. ఉత్కర్ కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లపై బీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం
Virat Kohli: స్టన్నింగ్ క్యాచ్ పట్టిన విరాట్ కోహ్లీ.. వీడియో
Bhadradri Kothagudem | ముసురుతో ఉప్పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు!
Renu Desai | పవన్ కళ్యాణ్ ‘బాలు’ ప్యాంట్ వెనుక ఇంత కథ ఉందా.. రేణు దేశాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

