Eshwar Sai | ‘బాసింగ బలాలు’ వంటి ఫోక్ సాంగ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఫేమస్ డ్యాన్సర్ ఈశ్వర్ సాయి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని వదిలేశాడంటూ ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి ఈశ్వర్ సాయి కోసం గాలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఈ వ్యవహారంపై స్పందించారు. ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు సంచలన విషయాలను వెల్లడించారు. అంతేకాదు, తన భర్త ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ మధ్య జరిగినట్లు చెబుతున్న ఓ ఫోన్ కాల్ రికార్డును కూడా బయటపెట్టారు.
శరణ్య చెప్పిన వివరాల ప్రకారం.. తాను ఓ రూమ్ వద్దకు వెళ్లినప్పుడు మాధురి రాథోడే డోర్ ఓపెన్ చేశారని తెలిపారు. అంతేకాదు, ఈశ్వర్ సాయి గతంలో చెప్పిన కొన్ని విషయాల వెనుక మాధురి రాథోడ్ సూచనలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. తాజాగా బయటపెట్టిన ఫోన్ కాల్ రికార్డులో ‘పెళ్లి వద్దు.. మనం రిలేషన్‌లోనే ఉందాం’ అనే మాటలు ఉన్నాయని శరణ్య పేర్కొన్నారు. దీంతో ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చినట్లు ఆమె వాదించారు. మాధురి రాథోడ్ ఉన్న రూమ్‌లో తన భర్త ఈశ్వర్ సాయికి చెందిన చార్జర్, స్లిప్పర్స్ ఉన్నాయని శరణ్య చెప్పారు. అయితే ఈశ్వర్ సాయి మాత్రం తాను ఆ రూమ్‌కు కేవలం వాష్‌రూం ఉపయోగించుకోవడానికి మాత్రమే వెళ్లానని గతంలో చెప్పినట్లు ఆమె గుర్తుచేశారు.
ఈ వివరణ కూడా ముందుగానే రూపొందించిన ప్లాన్‌లో భాగమేనని శరణ్య ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై మాధురి రాథోడ్ వైపు నుంచి వచ్చే స్పందన కీలకంగా మారనుంది.ఈశ్వర్ సాయి గతంలో విడుదల చేసిన ఓ వీడియోలో మాధురి రాథోడ్‌తో తనకు కేవలం ఎమోషనల్ బాండింగ్ మాత్రమే ఉందన్నట్లుగా మాట్లాడిన విషయం కూడా వివాదంలోకి వచ్చింది. ఈ వీడియో వెనుక కూడా మాధురి రాథోడ్ ప్లాన్ ఉందని శరణ్య ఆరోపించారు. వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో ఈశ్వర్ సాయి కాకుండా మరో వ్యక్తి మాట్లాడారని ఆమె పేర్కొన్నారు.అంతేకాదు, ఈ వ్యవహారానికి సంబంధించి తన వద్ద మరిన్ని ఫోన్ కాల్ రికార్డులు ఉన్నాయని శరణ్య వెల్లడించారు. అయితే ఆ కాల్స్‌లో ఉన్న థర్డ్ పర్సన్ గురించి మాత్రం తనను ప్రశ్నించవద్దని ఆమె చెప్పడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాధురి రాథోడ్ ఫిర్యాదు నేపథ్యంలో నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసినట్లు సమాచారం. తనను లైంగికంగా వేధించారని, పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను ఉపయోగించుకుని వదిలేశారని మాధురి ఆరోపించినట్లు తెలుస్తోంది.