భారీ వర్షం అస్తవ్యస్తం
నగరంలో శుక్రవారం భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు జలమయమై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకపోవడంతో అనేక ప్రాంతాల్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు.
- కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా ట్రాఫిక్ జామ్.. వన్‌వేతో ఇబ్బందులు పడ్డ వాహనదారులు
నగరంలో శుక్రవారం భారీ వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రోడ్లు జలమయమై భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకపోవడంతో అనేక ప్రాంతాల్లో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. సాయంత్రం ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇండ్లకు బయలుదేరే సమయంలోనే వర్షం కురవడంతో వాహనాలు నెమ్మదించి.. రహదారులపై రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. అదే సమయంలో వరదనీరు పోటెత్తడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించలేక.. పోలీసులు చేతులెత్తేశారు. ఫలితంగా గంటల తరబడి వాహనాలు కదలకపోవడంతో ఒకవైపు వర్షం.. మరోవైపు ట్రాఫిక్ జంఝాటంతో ప్రయాణికులు నరకం చూశారు. -సిటీబ్యూరో
గ్రేటర్లో శుక్రవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఒక పక్క వేసవిని తలపిస్తున్న ఎండలు, మరో పక్క అడుగంటిపోతున్న భూగర్భజలాలతో తలెత్తుతున్న నీటి ఎద్దడి వంటి సమస్యలతో సతమతమవుతున్న నగర వాసిపై వరుణుడు ఎట్టకేలకు కరుణించాడంటూ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ఒకసారిగా వాతావరణం మారిపోయింది. నల్లటి మేఘాలు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. పలు ప్రాంతాలతో పాటు శివారు ప్రాంతాల్లోను వర్షం దంచికొట్టింది. ఈ వర్షాకాలంలో ఇదే అత్యధిక వర్షపాతం కావడమే కాకుండా గంట పాటు సుదీర్ఘ సమయం కురిసిన వర్షంగా కూడా రికార్డు నమోదు చేసింది.
– సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ)

సిటీబ్యూరో/బంజారాహిల్స్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ) : శుక్రవారం సాయంత్రం.. అరగంట పాటు కుండపోతగా వర్షం.. ఎప్పుడూ లేని విధంగా కేబీఆర్ పార్క్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్.. కేవలం అరకిలోమీటరు ప్రయాణానికి ఇరవై ఐదు నిముషాల సమయం.. నగరంలో భారీగా కురిసిన వర్షానికి కేబీఆర్ పార్క్ వద్ద పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. వన్‌వే విధానం అమలు చేసిన తర్వాత వాహనాలన్నీ ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. అరగంట వర్షానికే నగరం అతలాకుతలమైంది. బంజారాహిల్స్ రోడ్‌నంబర్ 10 జహీరానగర్ నుంచి తెలంగాణ భవన్ దాకా, కేబీఆర్ నుంచి తెలంగాణ భవన్‌కు వెళ్లే దారిలో వాహనాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. కేబీఆర్ చుట్టూ పెద్ద పెద్ద గుంతలు తవ్వి వన్‌వే అమలు చేస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు వర్షం అంతరాయం కలిగించింది. గతంలో ఎప్పుడూ కేబీఆర్ చుట్టూ ఇటువంటి పరిస్థితి లేదని వాహనదారులు తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా వన్‌వే అంటూ చేసిన హడావిడి మొత్తం ఈ వర్షంతో ఖతమైందని, ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని చక్కబెట్టాలని చూసినా క్షేత్రస్థాయి పరిస్థితులు వారికి సహకరించకపోవడంతో ట్రాఫిక్ జామ్ అయిందని వారు మండిపడ్డారు.
నాలాలో కొట్టుకుపోయిన డెలివరీ బాయ్.. కాపాడిన పోలీసులు
మాదాపూర్, అక్టోబర్ 30: వర్షపు నీటి ఉధృతికి బైక్‌తో సహ నాలాలో పడిపోయిన ఓ డెలివరీ బాయ్‌ను పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. ఈ ఘటన శుక్రవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. విఠల్‌రావు నగర్ పరిధిలో శక్రవారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో జెప్టో సంస్థకు చెందిన డెలివరీ బాయ్ ఘంటసాల అర్జున్ కుమార్తన బైక్ పై వెళ్తుండగా రోడ్డుపై భారీగా ప్రవహిస్తున్న నీటి ఉధృతికి సమీపంలోని నాలాలోకి కొట్టుకుపోయాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఎన్డీఆర్ఎఫ్ సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అర్జున్ కుమార్‌ను సురక్షితంగా బటయకు తీశారు.
తప్పని ట్రాఫిక్ తిప్పలు
పలు ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి, మాదాపూర్ , జూబ్లీహిల్స్ , బంజారాహిల్స్ , సికింద్రాబాద్ , దిల్సుఖ్ నగర్ , ఉప్పల్ , మేడిపల్లి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. ఐటీ కారిడార్‌లో వాహనాలు నెమ్మదిగా కదలడంతో కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు ఎదురొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

