సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాజకీయ కక్షపూరితంగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో గ్రేటర్‌లోని ముఖ్య కూడళ్లలో ఆమెకు మద్దతుగా భారీ ఫ్లెక్సీలు వెలిశాయి. ‘ఫైటర్ ఆఫ్ డాటర్ నెవర్ ఫియర్, సేవ్ ఇండియా ఫ్రం బీజేపీ, వీ ఆర్ విత్ కవితక్క అనే నినాదాలతో కూడిన ఫ్లెక్సీలను కేబీఆర్ పార్కు ప్రవేశ ద్వారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు పంజాగుట్ట, ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేశారు.