అధిక వేడిగాలి వల్ల ముప్పు
ఇంట్లో ఉన్నా ప్రమాదం తప్పదు
ప్రధానంగా చిన్నారులు, వృద్ధుల్లో సమస్య
ఎండలో తిరగకపోవడమే మేలు
సిటీబ్యూరో, ఏప్రిల్ 4: సాధారణంగా ఎండాకాలంలో ఆరుబయట తిరగడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. అయితే ఇంట్లో ఫ్యాన్ గాలి వల్ల ఈ ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. ఎండలో తిరగకున్నా ఇంట్లో ఫ్యాన్ కింద ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా ఎండదెబ్బ తప్పదంటున్నారు. ముఖ్యంగా ఏప్రిల్, మే మాసాల్లో డీ-హైడ్రేషన్ కేసులు ఎక్కువగా వస్తుంటాయి. ఫ్యాన్ల కింద కూర్చోవడం కూడా ఇందుకు కారణమని అంటున్నారు. వృద్ధులు, చిన్నారులు అధికంగా ఈ సమస్యకు గురవుతున్నట్లు చెబుతున్నారు.
చెమట ఆవిరి కావడం వల్లే..
సాధారణంగా ఎండ వేడికి ఇంట్లో ఉన్నా చెమటలు పడుతాయి. దీనివల్ల శరీరంలోని లవణాలు చెమటరూపంలో బయటకు వెళ్తాయి. ఆ చెమట తిరిగి మన శరీరంలోకి పోవడంతో శరీరం తనంతట అదే చల్లబడి బ్యాలెన్స్ అవుతుంది. అంతేకాకుండా శరీరంలో నుంచి చెమట రూపంలో బయటకొచ్చిన లవణాలు తిరిగి మన శరీరంలోకి వెళ్తాయి. సాధారణంగా మన శరీరతత్వం. ఇంట్లో ఉన్నా, ఎండలో తిరిగినా జరిగే ప్రక్రియ ఇది. ఎండ తీవ్రత వల్ల ఇండ్లల్లో కూడా వేడి పెరుగుతుంది. ఇంట్లోనే ఉన్నప్పటికీ చెమటలు పడుతుండడంతో ఫ్యాన్ కింద కూర్చోవడం సహజం. ఆ సమయంలో మనకు తాత్కాలిక ఉపశమనం కలుగుతుంది. కానీ అదే ఉపశమనం మనల్ని ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. ఎలాగంటే తీవ్ర వేడివల్ల చెమట ఫ్యాన్‌గాలికి ఆవిరైపోతాయి. దీంతో శరీరంపై తేమ తగ్గిపోయి వేడెక్కుతుంది. చెమటలో ఉన్న లవణాలు కూడా ఆవిరైపోవడంతో డి-హైడ్రేషన్‌కు గురవుతారు.
ఫ్యాన్ తక్కువ స్పీడ్‌లో పెట్టాలి
ఫ్యాన్గాలిలో ఎక్కువసేపు ఉండటం వల్ల చెమట ఆవిరైపోతుంది. శరీరం పొడిబారి వేడెక్కి వడదెబ్బకు గురవుతుంది. ఒంట్లోని లవణాలు తగ్గిపోవడంతో డి-హైడ్రేషన్‌కు గురవుతారు. ముందుగా తలనొప్పి, నోరు ఎండిపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం, చర్మం పొడిబారడం జరుగుతుంది. సమస్య తీవ్రమైతే కాలేయం, కిడ్నీలు దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. తీవ్ర జ్వరంతో ఫిట్స్ రావచ్చు. ఎక్కువసేపు ఫ్యాన్‌కింద కూర్చోవాల్సి వచ్చినప్పుడు తరచూ ముఖంపై నీరు చల్లుకోవాలి. మెడ,చేతులపై తడిబట్టతో తుడుచుకోవాలి. ఫ్యాన్‌ను పెద్దగా కాకుండా చిన్న మోతాదులో పెట్టుకోవాలి. డయాబెటిక్, కిడ్నీ, గుండె సంబంధ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి.
– డాక్టర్ రాజేశ్, కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్, స్టార్ హాస్పిటల్
ఇలా జాగ్రత్త పడాలి..