హయత్‌నగర్, జూలై 23: చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను హయత్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 23 తులాల బంగారు నగలు, రూ. 2లక్షల నగదు, కారు, సెల్‌ఫోన్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. మంగళవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎల్బీనగర్ జోన్ డీసీపీ సీహెచ్.ప్రవీణ్ కుమార్, వనస్థలిపురం ఏసీపీ కాశీరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన షేక్ అజీజ్(38) ప్రైవేట్ ఉద్యోగి. ప్రస్తుతం అతడు విశాఖపట్నంలో ఉంటున్నాడు. ఈస్ట్‌గోదావరి జిల్లాకు చెందిన పత్తివాడ లోవరాజు(30) ఆటో డ్రైవర్.
వీరిద్దరు కలిసి పలుచోట్ల దొంగతనాలు చేశారు. వీరిపై 50కి పైగా కేసులున్నాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌కు కారులో వచ్చిన నిందితులు రాత్రి వేళల్లో కాలనీల్లో తిరుగుతూ.. తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసి, ఇనుపరాడ్లతో తాళాలు పగులగొట్టి బంగారు నగలు, నగదు, విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. అజీజ్‌కు తోడుగా లోవరాజు కారులోనే ఉంటూ కాలనీ వాసుల కదలికలను గమనిస్తుంటాడు. జూన్ 27న హయత్‌నగర్ పరిధిలోని గ్రీన్ హోమ్స్ కాలనీలో రెక్కీ నిర్వహించారు. కారులో లోవరాజు ఉండగా.. అజీజ్ వేర్వేరు ఇండ్ల తాళాలు పగులగొట్టి రెండు తులాల బంగారు గొలుసులు, నెక్లెస్, 6 చిన్న గొలుసులు, బ్లాక్ బీడ్స్ చైన్ బ్రాస్లెట్, 2 పెయిర్ ఇయర్ రింగ్స్, 2 మాట్నీలు, కాసుల పేరు, 10 రింగులను బీరువాల్లో నుంచి ఎత్తుకెళ్లారు. జూలై 23న ఉదయం పెద్ద అంబర్‌పేటలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ జి.రామకృష్ణ, సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా.. అనుమానాస్పదంగా ఉన్న అజీజ్‌తోపాటు కారును స్వాధీనం చేసుకుని విచారించగా.. నేరాలను అంగీకరించాడు. అజీజ్‌కు సహకరించిన లోవరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో హయత్‌నగర్ ఇన్స్పెక్టర్ జి.రామకృష్ణ, ఎస్ఐ కట్టా వెంకట్‌రెడ్డి, ఏఎస్ఐ పెంటారెడ్డి, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, ఉపేందర్, మహేశ్, సతీష్, గోపి, నాగార్జున, హర్షవర్ధన్‌రెడ్డి, లింగయ్య, హోంగార్డు శ్రీనివాస్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.