మేడ్చల్ జోన్, ఆగస్టు 26: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోటి వృక్షార్చనలో భాగంగా ఒక్క రోజు ఒక కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ఉత్సవాహంగా నిర్వహించారు. మేడ్చల్ మున్సిపాలిటీలోని 4వ వార్డులో ఫెబుల్ కౌంటీ వెంచర్లో చైర్ పర్సన్ మర్రి దీపిక నర్సింహారెడ్డి, కమిషనర్ టీఎస్‌వీఎన్. త్రిల్లేశ్వర్‌రావు శనివారం 1100 మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తుందన్నారు.కార్యక్రమంలో వైస్ చైర్మన్ రమేశ్, కౌన్సిలర్లు దేవరజా, గణేశ్, నర్సింహాస్వామి, శ్రీనివాస్‌రెడ్డి, ఉమానాగరాజు, మహేశ్, మాజీ ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, డీఈ విజయలక్ష్మి, ఇన్చార్జి ఆర్ఓ రాంచందర్, ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, పర్యావరణ ఇంజినీర్ జ్ఞానేశ్వర్‌రెడ్డి,సిబ్బంది ఉన్నారు.