Harish Rao | రేవంత్ రెడ్డి లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు.. ఇది ఒక మాసబ్ ట్యాంక్ పోరాటం కాదు.. ఒక కాలేజీ పోరాటం కాదు.. ఒక లక్ష మంది విద్యార్థుల పోరాటమనే విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు. మాసబ్ ట్యాంక్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనకు హరీశ్ రావు మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మొన్న ఢిల్లీలో చూశాం. నీట్ ప్రశ్నాపత్రం లీకైతే ఢిల్లీ వీధుల్లో జెన్ జీ ఉద్యమాన్ని మంన చూశాం. ఆ జెన్ జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో లక్ష మంది అదే జెన్ జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాము. గత 20 రోజులుగా ఈ జెన్ జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సెల్యూట్ అన్నారు.
మహబూబాబాద్‌లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సీఐ అతని గొంతు పట్టి పిసుకుతున్నాడు.. ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్టులా..? అని నేను రేవంత్‌రెడ్డిని అడుగుతున్నా అని హరీశ్ రావు అన్నారు. మొన్న సూర్యాపేటలో ఒక పాలిటెక్నిక్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేస్తే.. అక్కడున్న పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోలీసులను చుట్టుముట్టి ఆ విద్యార్థిని విడిపించిన వీడియో కూడా మనం చూశాం. జెన్ జీని తక్కువ అంచనా వేయకు రేవంత్ రెడ్డి..? నరేంద్రమోదీని, కేంద్ర ప్రభుత్వాన్నే గడగడలాడించింది ఈ తరం జెన్ జీ. అని హరీశ్ రావు హితవు పలికారు. మా లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదిలితే నువ్వు సెక్రటేరియట్లో అడుగుపెడుతవా..? సెప్టెంబర్ 7న అసెంబ్లీ స్టార్ట్ అయ్యేలోపు GO 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
రేవంత్ రెడ్డి లక్ష మంది పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు
ఢిల్లీలో జెన్ జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఇప్పుడు తెలంగాణలో అదే జెన్ జీ పోరాటం చూస్తున్నాము
మహబూబాబాద్‌లో విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సీఐ అతని గొంతు పట్టి… https://t.co/oj9hLM3XVc pic.twitter.com/mt6VIzvY1O
— Telugu Scribe (@TeluguScribe) August 25, 2026
East Coast | పదో తరగతి అర్హత.. పదిహేను వందలకుపైగా పోస్టులు
Konda Surekha | కొండా సురేఖ మాజీ ఓఎస్డీ కేసు.. జూబ్లీహిల్స్ సీఐ సస్పెన్షన్..!