సైదాబాద్, జూన్ 26 : మొహర్రం సందర్భంగా శుక్రవారం పాతబస్తీలోని డబీర్‌పురా బీబీ ఆలంలో పీర్లకు మాజీ మంత్రి హరీశ్ రావు దట్టీలు సమర్పించారు. అంతకుముందు ఆజంపురాలోని మాజీ మంత్రి మహమూద్ అలీ, బీఆర్ఎస్ గ్రేటర్ సెక్రటరీ ఆజం అలీ నివాసానికి విచ్చేసి తేనేటి విందును స్వీకరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ సలీం పాషా, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఫసివుల్లా ఖాన్, మలక్‌పేట బీఆర్ఎస్ ఇన్చార్జి తీగల అజిత్ రెడ్డి, హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ భూమేశ్వర్, మహేశ్, లలిత, రాధ, పగిళ్ల శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్‌రావు, అమర్నాథ్, దేవేందర్, మారుతి, దామోదర్, శ్రీధర్, సల్మాన్, డాక్టర్ సుమన్, నర్సింగ్, మున్వార్ ఖాన్, ఖాజా మజారుద్దీన్ పాల్గొన్నారు.