బొల్లారం, మే 10: ప్రేమ పేరుతో బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ తిరుపతి రాజు వివరాల ప్రకారం .. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓంరాజ్ షైనీ (20 ) బతుకు దెరువుకోసం బోయినపల్లికి వచ్చి చిన్న తోకట్ట వద్ద స్నేహితులతో కలిసి ఓ రూమ్ లో అద్దెకు ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇదే ప్రాంతంలో ఉంటున్న పశ్చిమ బెంగాల్‌కు చేందిన బాలిక (16)తో అతనికి పరిచయం ఏర్పడింది.
ఆ తర్వాత బాలికను ప్రేమిస్తున్నానని నమ్మించి.. తన గదికి పలుమార్లు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఇటీవల అతను తప్పించుకు తిరుగుతుండడంతో మోసపోయానని గ్రహించిన బాలిక.. విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.