Women Safety | సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ) : నగరంలో అమ్మాయిలకు రక్షణ కరువవుతున్నది. ఆడపిల్లలకు పోకిరీల వేధింపులు పెరిగిపోయాయి. షీటీమ్స్ ఎంతగా నిఘా పెట్టినా ఆకతాయిలు తమ వెకిలివేషాలు మానకపోవడంతో మహిళలు, యువతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. రెండేండ్లుగా పోకిరీల వేధింపుల కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. షీటీమ్స్ నిఘాలో కొన్ని సంఘటనలే వెలుగుచూస్తున్నప్పటికీ మరికొందరు అమ్మాయిలు బయటకు చెప్పుకోవడానికి ఇష్టం లేక తమ కుటుంబాలకు ఎక్కడ సమస్య వస్తుందోనంటూ వెనకడుగు వేస్తున్నారు.
మెట్రోలు, బస్‌స్టాపులు, కాలేజీలు, స్కూళ్ల వద్ద పోకిరీల బెడద ఉంటున్న నేపథ్యంలో షీటీమ్స్ ఆయా ప్రాంతాల్లో నిఘా పెడుతూ వాళ్లను పట్టుకుంటున్నారు. అయితే కొందరు అమ్మాయిలు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న వేధింపులపై షీటీమ్స్ అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వారిని చైతన్యపరిచే ప్రయత్నం చేస్తున్నారు.
సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ):ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ర్యాపిడో రైడ్‌లో కాలేజీకి వెళ్లివచ్చేది. ఆ క్రమంలో ర్యాపిడో డ్రైవర్ ఆమె నెంబర్ సేవ్ చేసుకుని ఫోన్ చేసి వేధించడం, అసభ్యకరమైన సందేశాలు పంపించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు షీటీమ్స్ కేసు నమోదు చేసింది. అతనికి న్యాయస్థానం ఏడురోజుల జైలుశిక్ష విధించింది. నగరంలోని ఓ ప్రాంతానికి చెందిన డిగ్రీ విద్యార్థినిని ఆమె ఇంటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి వేధిస్తున్నారు.
ప్రతిరోజూ ఏదో ఒక రకంగా వెకిలిగా వ్యవహరించడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. విషయం బయటపెడితే ఏం జరుగుతుందోనని భయపడింది. చివరకు స్నేహితురాలి సలహాతో షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. షీటీమ్స్ అతడిని అరెస్ట్ చేశారు. న్యాయస్థానంలో హాజరుపరచగా అతడికి ఏడు రోజుల జైలు శిక్ష విధించారు. మిత్రుడితో బైకుపై వెళ్తున్న ఓ ప్రబుద్దుడు రోడ్డుపై నిలుచుని ఉన్న ఓ అమ్మాయిని వేధించాడు. ప్రధాన ట్రాఫిక్ కూడలిలో ఆ అమ్మాయితో అనుచితంగా ప్రవర్తించాడు.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు బైక్ నెంబర్ ఆధారంగా అతనిని పట్టుకుని కోర్టులో హాజరుపరచగా రెండురోజుల జైలుశిక్ష విధించారు. నగరానికి చెందిన ఓ అమ్మాయికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. ఇద్దరూ ప్రతిరోజూ చాటింగ్ చేసుకునేవారు. కొన్నిరోజులకు ఆ వ్యక్తి బాధితురాలి దగ్గర కొంత డబ్బు తీసుకుని అవి త%B