Holi | హోలీ.. రంగుల కేళీ. నగరంలో ఆదివారం పలుచోట్ల చిన్నా, పెద్ద, యువత అంతా ఇంద్రధనుస్సు వర్ణాలలో తడిసి ముద్దయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని డీజే ధ్వనుల నడుమ సంగీతానికి లయబద్ధంగా నృత్యాలు చేసుకుంటూ ఉత్సాహంగా గడిపారు. నగరంలో ప్రధానంగా కూకట్పల్లి వై జంక్షన్, హుస్సేన్ సాగర్ తీరాన నెక్లెస్ రోడ్డులో నగరవాసులు హోలీ కేళిని ఎంతో సంబురంగా జరుపుకున్నారు. మరి కొందరు మిఠాయిలు పంచుతూ, పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.