ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థుల హాస్టల్, మెస్‌లు తక్షణమే ప్రారంభించాలంటూ పరిశోధక విద్యార్థులు గురువారం ఆందోళన నిర్వహించారు. ఓయూ ఎన్ఆర్ఎస్ హాస్టల్ ముందు ధర్నా చేపట్టిన సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ సంవత్సరంలో 365 రోజులు తెరిచి ఉండాల్సిన పరిశోధక విద్యార్థుల హాస్టళ్లు దాదాపు గత రెండేళ్ల నుంచి మూతపడ్డాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలో అనేక విద్యాసంస్థల హాస్టళ్లు ప్రారంభించిన కూడా ఓయూలో మాత్రం పరిశోధక విద్యార్థుల హాస్టళ్లు తెరవడం లేదని మండిపడ్డారు. అధికారుల మొండి వైఖరి కారణంగా పరిశోధక విద్యార్థులు తమ విలువైన సమయాన్ని నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, విద్యార్థులకు వసతి, భోజన సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సోమవారం లోపు మెస్ లుతెరవని పక్షంలో హాస్టళ్ల ముందు దీక్షకు సిద్ధమవుతామని హెచ్చరించారు.