హలీం బట్టీలను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి
అధికారులు, వ్యాపారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జడ్సీ రవికిరణ్
ఖైరతాబాద్, ఏప్రిల్ 6 : రంజాన్ మాసం ప్రారంభమైన మొదలు, పండుగ ముగిసేంత వరకు హలీం బట్టీలు ఏర్పాటు చేస్తుంటారు. హోటళ్ల యాజమాన్యాలు, చిరు వ్యాపారులు ప్రతి ఏడాది బట్టీలను ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తారు. ఈ నేపథ్యంలో బట్టీలు ఏర్పాటు చేసుకునే వారు నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. బుధవారం ఖైరతాబాద్ జోనల్ కార్యాలయంలో ఏఎంవోహెచ్, వెటర్నర్ , ఫుడ్ సేఫ్టీ అధికారులు, హలీం బట్టీల వ్యాపారులు, నిర్వాహకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ రవికిరణ్ మాట్లాడుతూ.. ఖైరతాబాద్ జోన్ పరిధిలో ప్రతి ఏడాది వందలాది హలీం బట్టీలు వెలుస్తాయని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లోనే బట్టీలు ఏర్పాటు చేసుకోవాలి
హలీం తయారీదారులు కొందరు పై అంతస్తుల్లో బట్టీలు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో అగ్నిప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా హలీం తయారీదారులు కిచెన్ లేక బట్టీలను గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఏర్పాటు చేసుకోవాలని జడ్సీ కోరారు. హలీంలో ప్రధానంగా వినియోగించే మాంసం విషయాల్లో నిబంధనలు తప్పవని, సంబంధిత వెటర్నరీ అధికారి పరీక్షించి స్టాంప్ వేసిన మాంసాన్ని మాత్రమే వాడాలన్నారు. అలాగే జీహెచ్ఎంసీ మాంసం విక్రయ కేంద్రాల (స్లాటర్ హౌజ్) నుంచి తీసుకొచ్చిన వాటిని హలీంకు వినియోగించాలన్నారు. హలీం బట్టీల వద్ద ఎప్పటి కప్పుడు పాటించాలన్నారు. లు జీహెచ్ఎంసీ వాహనాలకు అందజేయాలన్నారు. రోడ్ల పక్కన ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా హలీం బట్టీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. తయారీ దారులు నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను అధికారులు పర్యవేక్షిస్తూ రిపోర్టు తయారు చేసుకోవాలని, పాటించని వాటిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వెటర్నరీ ఏడీ డాక్టర్ వివేకానంద, అధికారులు డాక్టర్ మోహన్‌రెడ్డి, డాక్టర్ సబితా, సర్కిల్ 17, 18 ఏఎంవోహెచ్‌లు డాక్టర్ భార్గవ్ నారాయణ, డాక్టర్ రవికాంత్, జీహెచ్ఎంసీ (ఎస్వీఎం) విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ బి. వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.